బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మే 2023 (16:32 IST)

రాఘవ్ చద్దా ప్రేమలో మునిగిపోయాను.. పరిణీతి చోప్రా

Parineeti Chopra
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తన కాబోయే భర్త రాఘవ్ చద్దా ద్వారా తాను పొందుతున్న ప్రేమకు ధన్యవాదాలు నోట్ రాసింది. ఈ సందర్భంగా నిశ్చితార్థం జరిగిన రెండు రోజుల తర్వాత, పరిణీతి ఇన్‌స్టాగ్రామ్‌లో తన భావాలను పంచుకుంది. గతకొన్ని వారాలుగా.. ముఖ్యంగా తన కాబోయే భర్త రాఘవ్ ద్వారా తాను పొందిన ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. 
 
రాఘవ్ ప్రేమలో మునిగిపోయానని వెల్లడించింది. తామిద్దరం వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చాం. మా ఇద్దరి ప్రపంచాలు ఏకమవుతాయని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా వుందని చెప్పింది. తాము ఊహించిన దానికంటే పెద్ద కుటుంబాన్ని పొందామని పరిణీతి చోప్రా వెల్లడించింది.