శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (11:30 IST)

పరుచూరి వేంకటేశ్వరరావు ఇలా మారిపోయారేంటి?

Paruchuri Venkateswara rao
సినీ రంగంలో రచయితలుగా పరుచూరి బ్రదర్స్ చక్రం తిప్పారు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. అయితే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వర రావు వయోభారంతో కుంగిపోతున్నారు. ఆయన్ని తాజాగా చూసినవారంతా ఎలా వున్న మనిషి ఇలా అయిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
వయోభారంతో కృంగిపోతున్న ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్‌ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 
 
ఇంకా తన గురువుగారు పరుచూరి వేంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్‌ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించాయని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.