ఆగస్టు 11 ముహూర్తం.. నువ్వానేనా అంటూ పోటీ పడుతున్న పవన్-ఎన్టీఆర్.. వార్ తప్పదా?
పవన్ - త్రివిక్రమ్‌ల సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఇప్పటికే ఆగస్టు 11న ఖర్చీప్ వేసేశాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతు
పవన్ - త్రివిక్రమ్‌ల సినిమాను ఆగస్టు 11న విడుదల చేసేందుకు మాటల మాంత్రికుడు సర్వం సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు, ఇప్పటికే ఆగస్టు 11న ఖర్చీప్ వేసేశాడు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు.
ఎన్టీఆర్ సరసన కాజల్, అనుపమ, నివేదా థామస్‌లు జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఎన్టీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకుడు బాబీకి గట్టి హెచ్చరికలు కూడా చేశాడట.
ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది ఆగస్టులో పవన్ - ఎన్‌టీఆర్‌ల మధ్య యుద్ధం జరగేలా ఉందని ప్రేక్షకులు చర్చించుకొంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ.. నందమూరి హీరో శాతకర్ణి సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇరు హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది.
ఇదే పరిస్థితి ఆగస్టు నెలలోనూ జరుగనుందని టాలీవుడ్ సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. తమ్ముడు-అబ్బాయి సినిమాలు ఆగస్టులో రిలీజై కలెక్షన్ పరంగా పోటీ పడనున్నాయని వారు చెప్తున్నారు.