సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 13 అక్టోబరు 2017 (13:56 IST)

కొడుకు జాతకం చూసి షాకైన పవన్... ఎందుకు?

పవన్ కళ్యాణ్‌‌కు కుమారుడు పుట్టిన తరువాత అతని జాతకం తెలుసుకుని పవన్ కళ్యాణ్‌ షాకయ్యాడట. ఉదయం 10.32 నిమిషాలకు హైదరాబాద్‌లో కొడుకు పుట్టాడు. అతని జాతకంలో వృషభంలో చంద్రుడు ఉండటంతో జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం.. రాశి వృషభ రాశి.. లగ్నం వృశ్చి

పవన్ కళ్యాణ్‌‌కు కుమారుడు పుట్టిన తరువాత అతని జాతకం తెలుసుకుని పవన్ కళ్యాణ్‌ షాకయ్యాడట. ఉదయం 10.32 నిమిషాలకు హైదరాబాద్‌లో కొడుకు పుట్టాడు. అతని జాతకంలో వృషభంలో చంద్రుడు ఉండటంతో జన్మ నక్షత్రం రోహిణీ నక్షత్రం నాలుగో పాదం.. రాశి వృషభ రాశి.. లగ్నం వృశ్చిక లగ్నం.. రాహువు కర్కాటకంలో ఉన్నాడు. చంద్రుడు వృషభంలో ఉన్నాడు. అలాగే కుజుడు సింహంలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు కన్యారాశిలో ఉన్నారు.
 
జాతకం ప్రకారం ఎప్పుడైనా బృహస్పతి ప్రత్యక్షంగానీ కాని పరోక్షంగా గాని సంజీవుడితో కారకుడైనా శుక్రుడితో సంబంధం పెట్టుకుంటే అద్భుతమైన ఆయుష్షు లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆలోచనా విధానం కూడా చాలా బాగా ఉంటుంది. అంతేకాదు లోతైన ఆలోచనాపరుడిగా కూడా ఉంటాడు. 
 
మనస్సు ఆధ్మాత్మిక విషయాలు, తత్వవేత్తగా ఉంటారు. అమోఘమైన తెలివితేటలు ఉంటాయి. తల్లి మాట అస్సలు వినడు. తండ్రి అంటే గౌరవం ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న పవన్ కళ్యాణ్‌ ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో ఆనంద బాష్పాలు రాల్చారట పవన్ కళ్యాణ్‌.