పవన్ కళ్యాణ్ OG' చిత్రం లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ.జి. సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం 'దే కాల్ హిమ్ OG' చుట్టూ ఉన్న ఉత్సాహం మళ్లీ పునరుద్ధరించబడింది. సినిమా ప్రీమియర్ తేదీ సెప్టెంబర్ 27, 2024 అని తెలియజేశారు.
ప్రియాంక అరుల్ మోహన్ ఒక లీడ్ రోల్ చేస్తోంది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శ్రియా రెడ్డి పాత్ర కీలకంగా వుండనుంది. ఇటీవలే సలార్ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ లో ప్రేక్షకులను అలరించింది. ఇక ఓ.జి.లో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా వున్నాయని ఇటీవలే ఆమె తెలియజేసింది. తన పాత్ర చిన్నపాటి నెగెటివ్ షేడ్స్ వుంటాయని సూచాయిగా తెలియజేసింది. డి.వి.వి. దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.