సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:41 IST)

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌ మొదలైంది.. లాయర్‌ సాబ్‌గా జనసేనాని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలోనూ రీమేక్ అయ్యింది. ఈ చిత్రంలో అజిత్ అమితాబ్ బచ్చన్ పాత్రలో కనిపించారు. హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో పింక్ చిత్రం రూపొందిన సంగ‌తి తెలిసిందే. 
 
తాజాగా ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. దిల్ రాజు, బోనిక‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఒక‌టి ఫిలిం న‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ''లాయ‌ర్ సాబ్‌'' అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నారని సమాచారం. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది.
 
తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ పింక్ రీమేక్‌పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. పింక్ రీమేక్‌కి సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ థ‌మ‌న్ మొద‌లు పెట్టారని పేర్కొంది. ఇందులో నివేధా థామ‌స్ తాప్సీ పాత్ర‌ని పోషిస్తుంద‌ని సమాచారం.
 
కానీ చిత్ర నిర్మాణ సంస్థ ప్ర‌క‌ట‌న‌లో పవ‌న్ క‌ళ్యాణ్ పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీనిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఈ సినిమాలో పవన్ నటిస్తున్నారా లేదా అనే దానిపై క్లారిటీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.