శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (10:06 IST)

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి హిమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ రిలీజ్

himraan hashmi
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "ఓజీ". సుజీత్ దర్శకుడు. ఈ చిత్రంలో కీలక విలన్ పాత్రను హిమ్రాన్ హష్మీ పోషిస్తున్నారు. ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజా రిలీజ్ చేశారు. "గంభీరా.. ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది" అంటూ హష్మీ ఓ డైలాగ్‌ను పోస్ట్ చేశారు. ఇమ్రాన్ హష్మీ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్‌ను రిలీజ్ చేశారు.
 
స్టైలిష్‌గ సిగార్ వెలిగించుకుంటున్న ఇమ్రాన్ హష్మీని ఈ ఫస్ట్ లుక్ పోస్టరులో చూడొచ్చు. ఓజీ చిత్రంలో ఇమ్రాన్ పాత్ర ఓమీ బావు. తెలుగులో ఇమ్రాన్ హష్మీకి ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక బీభత్సమైన గ్యాంగ్ స్టర్ పాత్రను పోషిస్తున్నారు. 
 
ఇక తన ఫస్ట్‌లుక్‌పై ఇమ్రాన్ షష్మీ.. ఓజీ చిత్రంలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. "గంభీరా.. నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా.. ప్రామిస్... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది' అంటూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ పేరు ఈ చిత్రంలో గంభీరా అయివుంటుందని ఫ్యాన్స్ ఓ అంచనాకు వచ్చేశారు. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానరులో నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. sss