గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (19:19 IST)

నగ్నంగా పాయల్ రాజ్‌పుత్ - "మంగళవారం" ఫస్ట్ లుక్ రిలీజ్

payal rajputh
"ఆర్ఎక్స్ 100" ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మరో మంగళవారం. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. స్వాతి గునుపాటి, సురేష్ వర్మలతో కలిసి అజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాయల్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. మంగళవారం సినిమాలో శైలజ పాత్రలో పాయల్ కనిపించనున్నారు. 
 
మూవీ మేకర్స్ రిజీల్ చేసిన లుక్‌ను చూస్తే పాయల్ కళ్ళలో కన్నీటి పొర కనిపిస్తుంది. ఆమె వేలిపై సీతాకొక చిలుక ఉంది. జడలో మల్లెపూల్ ఉన్నాయి. అయితే, శరీరంపై ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్‌లా కనిపిస్తుంది. ప్రస్తుతం పాయల్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే క థతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా పాయల్ క్యారక్టరేజేషన్ ఉంటుంది. ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా ఇది. ఇందులో 30 పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యత ఉంటుంది అని వివరించారు.