బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (11:48 IST)

45 యేళ్ళ వయసులో మృతి చెందిన ఒరియా స్టార్

pintu nanda
చిత్రపరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒరియా ఇనీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ ఒకరు 45 యేళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆయన పేరు పింటు నంద. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధడుతూ వచ్చిన ఆయన... పరిస్థితి విషమించడంతో ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరానికి తరలించారు. అయితే, ఇక్కడ ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు 
 
వాస్తవానికి ఆయనకు కాలేయ మార్పిడి చికిత్స కోసం అన్ని ఏర్పాట్లుచేశారు. దాత కూడా లభించారు. కానీ, దాత రక్తపు గ్రూపు మ్యాచ్ కాకపోవడంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయలేకపోయారు. దీంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో ఒరియా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పింటు నంద మృతిపై ఒరియా స్టార్ సిద్ధాంత్ మహోపాత్ర స్పందిస్తూ, పింటూ తనకు తమ్ముడులాంటివాడని చెప్పాడు. ఆయన ఆకస్మిక మృతి తనకు తీరని లోటని చెప్పాడు.