శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఆగిన గుండె... ఎక్కడ?

youth dies
తెలంగాణాలోని నిర్మల్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో రిసెప్షన్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓయువకుడు డ్యాన్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. గుండెపోటు రావడంతో ఆ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో జరిగింది. కుప్పకూలిపోయిన ఆ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
ఈ గ్రామానికి చెందిన పార్థి కె గ్రామానికి చెందిన కిష్ణయ్య అనే వ్యక్తి కుమారుడి వివాహం శుక్రవారం భైంసా మండలంలోని కామెల్ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి పార్థిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుని బంధువు మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు పెళ్లికి వచ్చాడు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ వచ్చిన ఆ యువకుడు.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని ఆగమేఘాలపై సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, నాలుగు రోజుల క్రితం కూడా విజయవాడ నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడే కుప్పకూలి మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే, మరో ఘటనలో ఓ యువ కానిస్టేబుల్ జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ కుప్పకూలి చనిపోయాడు.