మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (15:37 IST)

పిప్పి పిప్పి.. పెళ్లి సంద‌డి... డుడ్డుం డుడ్డుం పెళ్లి సంద‌డి` పాట వ‌చ్చేసింది

Roshan, srilila
పెళ్ళంటే ఏమిట‌నేది అర్థ‌వంత‌మైన సాహిత్యంతో కూడిన `పిప్పి  పిప్పి.. పెళ్లి సంద‌డి... డుడ్డుం డుడ్డుం పెళ్లి సంద‌డి` అనే టైటిల్ సాంగ్ గురువారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ గీతం పెళ్లి సంద‌డిలో ఉండే సంద‌డి గురించి  హీరో హీరోయిన్లు పాడుతూ ఆడుతున్నారు. అస‌లు వాళ్లు అలా సంద‌డి చేయ‌డానికి కార‌ణం ఏంటో తెలుసుకోవాలంటే `పెళ్లి సంద‌D` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
 
ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే, 
 
కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రంతో న‌టుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. వ‌శిష్ట అనే పాత్ర‌లో మెప్పించ‌బోతున్నారు. అలాగే ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో కె.రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. 
 
కోలాహ‌లంగా జ‌రిగే పెళ్లిలో ఎలాంటి సందడి ఉంటుంద‌నే విష‌యాన్ని ఈ పాట ద్వారా వివ‌రించారు. పాట క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. అలాగే హీరో రోష‌న్‌, హీరోయిన్  శ్రీలీల జంట, వారి మ‌ధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్‌గా ఎలివేట్ అవుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి తెలియ‌జేశారు.