బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (12:27 IST)

బాలే డాన్స్‌లోనూ ప్రావీణ్య‌ముంద‌న్న‌ ‘పెళ్లి సంద‌D’ శ్రీలీల

Srileela birthday
ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న చిత్రం `పెళ్లిసంద‌D`. గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాత‌లు. రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ బ్యూటీ డాల్ పుట్టిన‌రోజు సోమ‌వారం (జూన్ 14). ఈ సంద‌ర్భంగా ‘పెళ్లి సంద‌D’ యూనిట్ సినిమా నుంచి శ్రీలీల గ్లింప్స్‌ను విడుద‌ల చేసింది.
 
కె.రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న శిష్యురాలు, చిత్ర‌ ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి శ్రీలీల అంతే గ్లామ‌ర‌స్‌గా తెర‌కెక్కించిన‌ట్లు గ్లింప్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ్రీలీల బెంగుళూరులో స్థిర‌ప‌డ్డ తెలుగు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. మెడిసిన్ చ‌దువుతుంది. అయితే న‌ట‌న‌పై ఆస‌క్తితో సినీ రంగంలో అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో రాఘ‌వేంద్రరావు సూచ‌న మేర‌కు గౌరి రోణంకి శ్రీలీల హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హాకీ, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్‌తో పాటు క్లాసిక‌ల్ డాన్స్‌, బాలే డాన్స్‌లోనూ శ్రీలీలకు మంచి ప్రావీణ్యం ఉంది. ఎంద‌రో హీరోయిన్స్‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేయ‌డం, తెలుగు వారి హృద‌యాల్లో వారికి సుస్థిర‌మైన స్థానాన్ని క‌లిగించిన ద‌ర్శ‌కేంద్రుడి ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతోన్న ‘పెళ్లి సంద‌D’ చిత్రంలో న‌టించ‌డం హీరోయిన్‌గా త‌న‌కెంతో ప్ల‌స్ అని హీరోయిన్ శ్రీలీల తెలియ‌జేసింది. 
 
గురువుగారు రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌ర‌వాణి కీర‌వాణి కాంబినేష‌న్‌లో సూప‌ర్ హిట్ సినిమా రూపొందింద‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఎన్నో మ్యూజిక‌ల్ సెన్సేష‌న్స్ రూపొందాయి. అదే స్టైల్లో ఈ సినిమాలోని పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఏడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ పూర్త‌య్యింది. లాక్‌డౌన్ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం’’ అని డైరెక్ట‌ర్ గౌరి రోణంకి తెలిపారు.