మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:59 IST)

అప్పుడు శ్రీ‌కాంత్‌తో ఇప్పుడు ఆయ‌న కొడుకుతో`పెళ్లిసంద‌D`

Raghavendrarao
ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు జీవితంలో విశిష్ట‌మైన రోజుఏప్రిల్‌28. ఎందుకంటే ఏప్రిల్‌28 క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త అర్ధం చెప్పి బాక్సాఫీస్‌లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించిన కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కత్వం వ‌హించిన `అడివిరాముడు` రిలీజైన రోజు. అదే ఏప్రిల్‌28 ప్ర‌పంచ చ‌ల‌న చిత్ర‌ చరిత్ర‌లో  సంచ‌ల‌నం సృష్టించి బాక్సాఫీస్ రికార్డుల‌కు కొత్త అర్ధం చెప్పిన కె. రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో తన శిష్యుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `బాహుబ‌లి 2` విడుద‌లైన రోజు. ఇలాంటి ఒక అత్యంత ప్రాముఖ్య‌త ఉన్న ఏప్రిల్‌28న ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు సార‌థ్యంలో రూపొందుతున్న `పెళ్లిసంద‌D` పాట‌ల సంద‌డి మొద‌ల‌వుతుంది.
 
1996లో విడుద‌లై ఏడాదిపాటు ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అద్భుత‌విజ‌యాన్ని సాధించ‌డ‌మేకాక పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్‌గా నిలిచింది నాటి `పెళ్లిసంద‌డి`. అయితే ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు మ‌ళ్లీ `పెళ్లి సంద‌D` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది ఆ పెళ్లిసంద‌డికి సీక్వెల్ కాదు. ఇది ఓ కొత్త క‌థ‌. నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి `పెళ్లిసంద‌D`లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు, స్వ‌రవాణి కీర‌వాణి కాంభినేష‌న్‌లో అప్ప‌టి `పెళ్లిసంద‌డి` పాట‌లు ఇప్ప‌టికీ ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఈ `పెళ్లిసంద‌D`కి కూడా కీర‌వాణి సంగీతం అందించ‌డం విశేషం. 
 
ఈ ఏప్రిల్‌28న రొమాంటిక్ మ్యూజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ `పెళ్లిసంద‌D`లోని ఓ పాట‌ను విడుద‌ల‌చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ పాట‌తో మ‌రోసారి కె. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిల పాట‌లసంద‌డి మ‌ళ్లీ మొద‌ల‌వుతుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్త‌య్యింది. 
 
రోష‌న్, శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్‌
సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి
సాహిత్యం: చంద్ర‌బోస్
ఆర్ట్‌: కిర‌ణ్
ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు
‌ఫైట్స్‌: వెంక‌ట్
కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కె. సాయిబాబా‌
బేన‌ర్స్‌: ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్‌, ఆర్కా మీడియా వ‌ర్క్స్
స‌మ‌ర్ఫ‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌
నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ
ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోనంకి