బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (12:39 IST)

నటి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు... అరెస్టు ఖాయమా?

srireddy
సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనితపై దుర్భాషలాడుతున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషనులో మంగళవారం ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, యర్రంశెట్టి ఈశ్వరి, కె.వసంత ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
కాగా, ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన అనేక మంది వైకాపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో నటి శ్రీరెడ్డి భయపడిపోయి తాను తెలిసో తెలియకో తప్పు చేశానని, అందువల్ల తమను క్షమించి వదిలివేయాలంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు మాత్రం ఆమెను క్షమించేలా కనిపించడం లేదు. దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చెన్నైలో ఉంటున్నారు. 
 
ఏపీ డిప్యూటీ స్పీకరుగా ఆర్ఆర్ఆర్? 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా వైకాపా మాజీ మంత్రి, ప్రస్తుత ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. రఘురామకృష్ణం రాజు ఎంపికకానున్నారు. ఈ మేరకు ఆయన పేరును టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ఉప సభాపతి ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్ నేడు లేదా రేపు వెల్లడయ్యే అవకాశం ఉంది. పైగా,  ఈ పదవికీ ఎవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు. దీంతో ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్‌ను ఏకగ్రీవంగా ఎంచుకోవడం లాంఛనమేకానుంది. 
 
ఉప సభాపతి కోసం మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు అనేక మంది పేర్లను పరిశీలించారు. చివరకు ఆర్ఆర్ఆర్ వైపే ఆయన మొగ్గు చూపారు. బుధ, గురువారాల్లో డిప్యూటీ స్పకర్ పదవికి నోటిఫికేషన్ విడుదలకానుంది. మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేు ఆయనను ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఫలితంగా ఆర్ఆర్ఆర్ ఎన్నిక లాంఛనమేకానుంది. 
 
ఇక తాజా ఎన్నికల్లో ఆయన వెస్ట్ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన విషయం తెల్సిందే. గత 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన నరసాపురం లోక్‌సభ నుంచి వైకాపా తరపున గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ అధినేత జగన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి దిగి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 
 
కాగా, ఉప సభాపతిగా ఆర్ఆర్ఆర్ పేరును చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీకి రావడం లేదు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైనా ప్రతిపక్ష హోదా కావాలంటూ పట్టుబడుతున్నారు. అది సాధ్యంకాదు. దీంతో ఆయన అసెంబ్లీకి రావడం లేదు. ఈ క్రమంలో జగన్‌ను శాశ్వతంగా అసెంబ్లీలో అడుగుపెట్టనీయంగా చేసేందుకే ఆర్ఆర్ఆర్ పేరును ఉప సభాపతిగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.