సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (17:59 IST)

పూజా హెగ్డేకు చేదు అనుభవం: అతను ప్రవర్తించిన తీరు దారుణం

Pooja Hegde
హీరోయిన్  పూజా హెగ్డేకు చేదు అనుభవం ఎదురైంది. విపుల్ నకాషే అనే ఇండిగో సిబ్బంది పైన హీరోయిన్ పూజా హెగ్డే ఫైర్ అయింది. అతను ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందంటూ ట్వీట్ చేసింది. 
 
ముంబై నుంచి వస్తోన్న ఇండిగో విమానంలో విపుల్ నకాషే ఎటువంటి తప్పు లేకున్నా మాతో చాలా మొరటుగా ప్రవర్తించాడని పేర్కొంది. 
 
వాస్తవానికి తాను ఇలాంటి సమస్యల గురించి తాను పట్టించుకోనని కానీ ఈ  సంఘటన తనని ఎంతో భయపెట్టిందని పూజా తన ట్వీట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో  హాట్ టాపిక్‌గా మారడంతో ఇండిగో సంస్థ స్పందించింది. 
 
పూజా హెగ్డేకి క్షమాపణలు చెప్తూ "మీ ప్రాబ్లమ్‌ని, మీరు ప్రయాణించిన టికెట్ పీఎన్ఆర్ నెంబర్‌ని మెసేజ్ చేయండి, మేము త్వరగా మీ సమస్యని పరిష్కరిస్తామని పోస్ట్ చేసింది." అని కోరింది.