శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:03 IST)

సింగం సూర్యతో పూజా హెగ్డే.. సినిమా మామూలుగా వుండదట..

టాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు పూజ మీద కోలీవుడ్ దర్శక నిర్మాతల కన్ను పడిందట. తాజాగా పూజా హెగ్డే స్టార్ హీరో, సింగం ఫేమ్ సూర్య సరసన అవకాశం కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హరి చాలాకాలం టైం తీసుకొని సూర్య హీరోగా 'అరువా' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌‍గా పూజను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సూర్య-హరిల కాంబినేషన్ అంటే మాములుగా ఉండదు. అభిమానులలో సందడే ఎందుకంటే వాళ్లిద్దరూ కలిసి చాలా రికార్డులు బద్దలు కొట్టారు. సింగం సిరీస్ గురించి అందరికి తెలిసిందే. 
 
పూజాహెగ్డే... ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్. నాగచైతన్య హీరోగా నటించిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ భామ తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే.. అరవింద సమేత, మహర్షి చిత్రాల భారీ విజయాల తర్వాత తన హిట్ల పరంపర కొనసాగిస్తూ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. 
 
ప్రస్తుతం పూజాహెగ్డే.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అంతేగాక అఖిల్ - బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.