రూ.4 కోట్లిస్తే వస్తానంటున్న 'జిగేల్ రాణి'

Pooja Hegde
ఠాగూర్| Last Updated: గురువారం, 19 మార్చి 2020 (08:44 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో పట్టిందల్లా బంగారంగా మారిన హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈ భామ నటించిన ప్రతి చిత్రం సూపర్ హిట్టే. గత యేడాదిలాగానే ఈ యేడాది కూడా ఈ భామకు బాగా కలిసివచ్చింది. ఫలితంగా టాప్ గేర్‌లో దూసుకెళుతోంది. వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. దీంతో తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసింది.

గత సంక్రాంతికి విడుదలైన అల.. వైకుంఠపురంలో చిత్రంతో ఈ భామ క్రేజ్‌ ఆకాశానికి చేరిపోయింది. ఈ చిత్రం కోసం 2 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న ఈ అందాలభామ ఇప్పుడు తెలుగులో రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట.

ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ సరసన ‘జాన్‌', అఖిల్‌తో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రంలో నటిస్తున్న పూజాకు తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాందించుకుంది.

ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో బాలీవుడ్‌ జనాలను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు సల్మాన్‌ఖాన్‌తో నటించనున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’ చిత్రానికి రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందట.

ఇక పూజా హెగ్డేకు వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ చిత్ర నిర్మాత సాజిద్‌ నడియాలా కూడా ఆమె డిమాండ్‌కు అంగీకరించాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పడిన ఐటం గర్ల్ అనే ముద్రను చెరిపేసుకుంటూ ముందుకుసాగిపోతోంది.దీనిపై మరింత చదవండి :