శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మార్చి 2020 (15:53 IST)

సూర్య ఫ్యామిలీ ఆపన్నహస్తం... సినీ కార్మికుల కోసం రూ.10 లక్షల విరాళం

కరోనా వైరస్ కారణంగా అనేక వ్యవస్థలు స్తంభించిపోయాయి. అలాంటివాటిలో సినీ రంగం కూడా ఒకటి. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో అనేక మంది సినీ కూలీలు, కార్మికులు ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. వారితో పాటు.. వారి కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. 
 
అలాంటి కార్మికులను ఆదుకునేందుకు హీరో సూర్య కుటుంబం ముందుకు వచ్చింది. దక్షిణ భారత సినీ కార్మికుల సంఘం ఫెఫ్సీకి హీరో సూర్య ఫ్యామిలీ విరాళం ప్రకటించింది. సూర్య, ఆయన తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ సినీ కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ రూ.10 లక్షల విరాళం అందించాలని నిర్ణయించారు. కరోనా వైరస్ కారణంగా ఇండస్ట్రీ మూతపడడంతో ఉపాధి కోల్పోయిన కార్మికుల కోసం ఈ విరాళం అందిస్తున్నట్టు వారు సంయుక్తంగా వెల్లడించారు.
 
సాధారణంగా ఎలాంటి విపత్తు సంభవించినా బాధితుల కోసం ఆపన్న హస్తం అందించడంలో సూర్య ఫ్యామిలీ ఎపుడూ ముందుంటుంది. ఇక సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారంటే మాత్రం వారు అస్సలు తట్టుకోలేరు. గతంలో కూడా పలుమార్లు వారు సినీ కార్మికులను ఆదుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కూడా ఇదే విధంగా వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.