బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2025 (15:26 IST)

'కన్నప్ప' నుంచి క్రేజీ అప్‌డేట్... ఫిబ్రవరి 3న ఆ హీరో ఫస్ట్ లుక్

prabhas
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "కన్నప్ప". మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో వివిధ చిత్రపరిశ్రమలకు చెందిన అగ్ర నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ పాత్రను పోషించారు. 
 
ఈ పాత్రకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన 'కన్నప్ప' మూవీలోని ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్టు ఓ అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇందులో ప్రభాస్ నేత్రాలు, నుదుటి భాగం మాత్రమే కనిపిస్తుంది. నుదుటిపై విభూతి నామాలు, చేతిలో త్రిశూలంతో డార్లింగ్ పవర్ ఫుల్‌గా కనిపించారు. ఈ పూర్తి లుక్‌ను వచ్చే నెల 3వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 
 
కాగా, ఇటీవలే 'కన్నప్ప' నుంచి అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇందులో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్‌లు శివపార్వతులుగా కనిపించారు. ఈ భారీ బడ్జెట్ మూవీని ఏప్పిల్ 25వ తేదీన ఆరు భాషల్లో విడుదల చేయనున్నారు.