శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (20:08 IST)

ప్రభాస్‌లో గర్వం - అహంకారం ఉందా? (video)

'బాహుబలి' చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన హీరో ప్రభాస్. ఈ చిత్రం ద్వారా ఆయనకు బాలీవుడ్‌లోనూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రాన్ని పాన్ ఇండియాగా నిర్మించారు. ఇపుడు నిర్మించనున్న రాధేశ్యామ్ చిత్రాన్ని కూడా అదే తరహాలో నిర్మించనున్నారు. 
 
ఇందులో నటించే నటీనటుల ఎంపిక కూడా జరిగింది. ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి, ప్రేమ పావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ నటించనుంది. అలాగే, హీరోయిన్‌గా దీపికా పదుకొనె నటించనుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించనుండగా, గోపికృష్ణ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 
ఈ క్రమంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్‌పై భాగ్యశ్రీ ప్రశంసల వర్షం కురిపించింది. 'బాహుబలి' సినిమా చూసినప్పుడే ప్రభాస్‌పై తనకు ఒక మంచి అభిప్రాయం కలిగిందని చెప్పారు. ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడని అన్నారు. అయితే ఒక సూపర్ స్టార్‌కు ఉండే గర్వం, అహంకారం అతనిలో లేవని చెప్పారు. 
 
ప్రభాస్ ఎంతో నిరాడంబరంగా ఉంటాడని... అతని కలుపుగోలుతనం, మర్యాద ఇచ్చే పద్ధతిని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడతాడని... అతనొక టీమ్ ప్లేయర్ అని కితాబునిచ్చారు. ప్రభాస్ పద్ధతిని చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.