మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (09:04 IST)

కింగ్‌కు సరిపోయే క్వీన్‌ను ఎంపిక చేశాం : నాగ్ అశ్విన్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "సాహో" తర్వాత ప్రస్తుతం "రాధేశ్వామ్" చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించే ఈ చిత్రంలో హీరోయిన్ కోసం గాలించి, చివరకు ఓ క్వీన్‌ను ఎంపిక చేశారు. 
 
ఇదే అంశంపై నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ, ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్రనాయికల్లో ఒకరైన దీపికాపదుకునేను కథానాయికగా ఖరారు చేసినట్టు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని తెలిపారు.
 
'భారతీయ సినిమాలో మా సంస్థ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ సినిమాను సువర్ణావకాశంగా భావిస్తున్నాం. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్‌ అనుభూతిని అందించడానికి దీపికాపదుకునే వంటి అద్భుతమైన నటిని ఎంపిక చేసుకున్నాం' అవి తెలిపారు. 
 
'కింగ్‌కు సరిపోయే క్వీన్‌ కావాలి కదా... చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది' అని చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అలాగే, సహ నిర్మాతలు స్వప్నాదత్‌, ప్రియాంకాదత్‌ స్పందిస్తూ, సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని వెల్లడించారు.
 
కాగా, ప్రభాస్‌కు జోడీగా ఎంపిక చేయడం పట్ల దీపికా పదుకొనె స్పందిస్తూ, 'ఈ సినిమాలో భాగమవడం థ్రిల్‌కు మించిన అనుభూతిని కలిగిస్తోంది. మున్ముందు గొప్ప ప్రయాణానికి నాంది ఇది' అని ఆనందం వ్యక్తం చేసింది.