1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (17:17 IST)

కల్కి 2898ఎడి తో ప్రభాస్ కొత్త సినిమాల పై ప్రభావం

Prabhas-bhairava
Prabhas-bhairava
రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898ఎడి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. లోకల్ టు గ్లోబల్ ప్రభాస్ స్టార్ డమ్ సత్తా ఏంటో ఈ సినిమా ప్రూవ్ చేస్తోంది. వైజయంతీ మూవీస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ సైఫై మైథాలజీలో ప్రభాస్ భైరవ, కర్ణ అనే రెండు పాత్రల్లో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రభాస్ ను ఇప్పటిదాకా చూడని ఇలాంటి కొత్త తరహా పాత్రల్లో చూడటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తోంది. భైరవ క్యారెక్టర్ ను ఫన్, గ్రే, యాక్షన్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన విధానం హీరోయిజంలోనే ఒక ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.
 
గత సినిమా సలార్ తో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులను తన కొత్త సినిమా కల్కి 2898 ఎడితోనూ కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. ఆదిపురుష్ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకున్నా ప్రభాస్ స్టార్ డమ్ పవర్ లో ఏమాత్రం తేడా రాలేదని కల్కి సక్సెస్ ప్రూవ్ చేస్తోంది. ఏడాదికి మూడు సినిమాలతో మీ ముందుకు వస్తానని ప్రభాస్ అభిమానులకు మాటిచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ సలార్ తర్వాత కల్కిని తెరపైకి తీసుకొచ్చారు. స్టార్ గా ప్రభాస్ లోని డెడికేషన్ కు ఇది నిదర్శనం. ప్రభాస్ వరుసగా సినిమాలు చేయడం అభిమానులకే కాదు చిత్ర పరిశ్రమలోనూ వేలాది మందికి ఉపాధి కలిగిస్తుంది. అందుకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. 
 
క్రేజీ పాన్ ఇండియా మూవీస్ తో భారీ లైనప్ కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో త్వరలోనే సలార్ 2 ప్రారంభించబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ చిత్రానికి సంప్రదింపులు జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అలాగే కల్కి సీక్వెల్ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో  రెస్ట్ లెస్ గా తన షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ ప్రభాస్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరిస్తూ స్టార్ గా ఆయనను మరింత ఎత్తుకు తీసుకెళ్లనున్నాయి.