బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (12:31 IST)

ప్రభాస్ రొమాంటిక్ మూవీ.. డ్యుయల్ రోల్... హీరోయిన్ ఎవరో తెలుసా?

బాహుబలి సినిమా కోసం తన కెరీర్‌లో ముఖ్యమైన కొంత కాలాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ధారపోసాడు. ఆ తర్వాత సాహో సినిమా కోసం కూడా కాస్త ఎక్కువ సమయమే కేటాయించాల్సి వచ్చింది. అందుకే సాహో సినిమా జరుగుతున్న దశలోనే మరో సినిమాను ఒప్పుకున్నాడు. 
 
జిల్ సినిమా తీసిన డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఒక సినిమా షూటింగ్ ఇటీవల ఇటలీలో ప్రారంభమైంది. 1960-70 కాలం నాటి స్థితిగతుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర హైలైట్‌గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
 
1960 కాలంలో ప్రభాస్, పూజ హెగ్డే మధ్య ప్రేమ సాగుతుందట. దానికి సమాంతరంగా ప్రస్తుత కాలంలో మరో కథ నడుస్తుందని తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఒక రోల్‌లో సిన్సియర్ ప్రేమికుడిగా, మరో పాత్రలో ప్లేబాయ్‌గా కనిపిస్తూ డ్యుయల్ రోల్ చేయనున్నాడట. 
 
ప్లేబాయ్ పాత్రకు జోడిగా కాజల్ అగర్వాల్ పేరు పరిశీలిస్తున్నారంట. ఎక్కువభాగం యూరప్‌లో షూటింగ్ జరగనున్న ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ కార్ల సంస్థకు అధిపతిగా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. జిల్ సినిమా తర్వాత దర్శకుడు రాధాకృష్ణ తీస్తున్న ఈ చిత్రాన్ని యూవీక్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.