మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (16:59 IST)

"సాహో" తర్వాత వ్యాపారమో.. వ్యవసాయమో చేస్తాను : హీరో ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాహో అనే టైటిల్‌ను ఖరారు చేయగా, ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బాహుబలి చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులను ఏమాత్రం నిరుత్సాహపరచకుండా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రభాస్‌తో పాటు.. చిత్ర యూనిట్ అహర్నిశలు కష్టపడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా స్పందిస్తూ, 'ఈ సినిమా పూర్తయిన తరువాత ఏదైనా వ్యాపారమో.. వ్యవసాయమో  చేసుకుంటానేమో' అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా షూటింగ్ పరంగా జరుగుతోన్న జాప్యానికి అసహనానికిలోనైన ప్రభాస్, సినిమాలు చేసుకోవడం కన్నా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకోవడం బెటర్ అనే అర్థం వచ్చేలా చమత్కరించినట్టు ఫిల్మ్ నగర్‍లో గుసగుసలు వినిపిస్తున్నాయి.