మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (13:38 IST)

మ‌హాన‌టి డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీ ఎవ‌రితోనో తెలుసా?

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలో విజ‌యంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్. ఆ త‌ర్వాత అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థను మ‌హాన‌టి టైటిల్‌తో సినిమాగా తెర‌కెక్కించి సంచ‌ల‌న విజ‌యం సొంతం

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలో విజ‌యంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్. ఆ త‌ర్వాత అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థను మ‌హాన‌టి టైటిల్‌తో సినిమాగా తెర‌కెక్కించి సంచ‌ల‌న విజ‌యం సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న నాగ్ అశ్విన్‌తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి కూడా నాగ్ అశ్విన్‌తో సినిమా చేసేందుకు రెడీ అన్నారు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... నాగ్ అశ్విన్‌తో సినిమా చేసేందుకు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఓకే చెప్పాడ‌ట‌. ఇటీవ‌ల స్టోరీ లైన్ విన్న ప్ర‌భాస్ వెంట‌నే ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయ‌మ‌ని చెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ అదే ప‌నిలో ఉన్నాడ‌ట‌. 
 
ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, మ‌హాన‌టి చిత్రాల‌ను నిర్మించిన వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా కూడా ఉంటుంద‌ని తెలిసింది. ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుతో అడ‌వి సింహాలు చిత్రాన్ని నిర్మించిన అశ్వ‌నీద‌త్.. ఇప్పుడు ప్ర‌భాస్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండ‌టం విశేషం.