Jagapathi Babu : బాహుబలి పెట్టిన ఫుడ్‌తో జగపతి బాబు (video)
Prabhas food Jagapathi Babu : ప్రముఖ నటుడు జగ్గూ భాయ్ ప్రస్తుతం "ఫౌజీ" షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజాగా జగపతి బాబు ప్రభాస్ తనకు పంపిన ఫుడ్ గురించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నోరూరించే శాఖాహారం, మాంసాహారం వంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి.
ఈ వీడియోకి జగపతి బాబు ఆసక్తికరమైన క్యాప్షన్‌ను ఇచ్చారు. వివాహ భోజనంబు అనే పాటను యాడ్ చేశారు. ఫుడ్ పెట్టే విషయంలో బాహుబలి లెవెల్ వేరు. పందికొక్కులాగా తిని, ఆంబోతులా పడుకుంటాను.. అంటూ జగపతిబాబు రాసుకొచ్చారు.
బకాసురుడిలా భోజనం చేసి, కుంభకర్ణుడిలా నిద్ర పోతాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది ప్రభాస్ ప్రమేయం లేకుండా జరిగిందని, దీని గురించి ఎవ్వరూ చెప్పొద్దని అన్నారు. ఎందుకంటే ఎవరైనా సరే చెప్తే తను పెట్టే ఫుడ్‌తో ఈ బాబు బలి అంటూ సరదాగా కామెంట్స్ చేశారు. అదీ బాహుబలి లెవల్ అంటూ కొనియాడారు.
అంతేకాకుండా ఆ వీడియోలో "షూటింగ్ కోసం భీమవరం చేరుకున్నాను. భీమవరం రాజుల ఆతిథ్యం అద్భుతంగా ఉంది. జై భీమవరం, జై రాజులు, జై బాహుబలి, జై ప్రభాస్.." అంటూ ప్రభాస్ అతిథ్యంపై జగ్గు భాయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.