బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (15:45 IST)

ప్రెగ్నెంట్‌గా ఉండి తెలుగులో సినిమాలు చేస్తానంటున్న హీరోయిన్...ఎవరు..?

పెళ్ళి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైన సమీరారెడ్డి మళ్ళీ రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్థమవుతోంది. తెలుగులో నటించాలని ఉందంటూ మనస్సులోని కోరిక వ్యక్తం చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన సమీరా తెలుగు సినిమాల్లో నటించేందుకు ఇప్పటి నుంచే ఆశక్తి చూపుతోంది.
 
సమీరారెడ్డి తెలుగు అమ్మాయే అయినా బాలీవుడ్లో తానేంటో నిరూపించుకున్న తరువాతే తెలుగులో నరసింహుడు సినిమాతో అడుగు పెట్టింది. తెలుగులో చేసింది నాలుగు సినిమాలే అయినా ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్స్‌తో జతకట్టింది. 2012 సంవత్సరంలో వచ్చిన క్రిష్ణం వందే జగద్గురు సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసిన తరువాత తెలుగులో కనిపించలేదు.
 
2014లో బిజినెస్ మ్యాన్ అక్షయ్ వార్డేను ప్రేమించి పెళ్ళి చేసుకున్న సమీరా 2013 నుంచి సినిమాలో నటించడం మానేసింది. ప్రస్తుతం రెండవసారి ప్రెగ్నెంట్ అయిన సమీరా ఒక కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు వచ్చింది. తెలుగులో నటిస్తానంటూ ఇప్పటినుంచే టాలీవుడ్ పైన కర్చీఫ్ వేసింది. 
 
టాలీవుడ్లో సమీరా నటించిన నాలుగింటిలో రెండింటిలో ఎన్టీఆరే హీరో. నాకు ఎన్టీఆర్ మంచి స్నేహితుడు. ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ చూస్తాను. స్వతహాగా నేను డ్యాన్స్ బాగా చేస్తాను. కానీ తారక్‌తో డ్యాన్స్ వేయడం కష్టమంటోంది సమీరా.