బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (17:36 IST)

గర్భిణీ మహిళలు లిప్‌స్టిక్ వేసుకోకూడదట.. ఎందుకంటే?

గర్భిణీ స్త్రీలు చాలా మందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ఉండదు. తినే తిండి, త్రాగే పానీయాలు, చేసే పనులు ఇలా అన్నింటి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా తల్లీ, బిడ్డ ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సాధ్యమైనన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ తెలియని వాటి గురించి ఇతరులను లేదా వైద్యులను అడిగి తెలుసుకోవాలి. 
 
గ‌ర్భిణీలు లిప్‌స్టిక్‌, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఇతర కాస్మెటిక్స్ ఎక్కువ‌గా వాడ‌కూడదు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు గ‌ర్భంతో ఉన్న మేక‌ప్ వేసుకునే స్త్రీల‌ను ప‌రీక్షించారు. పరిశోధనల్లో తేలిందేమిటంటే, గ‌ర్భం దాల్చిన స్త్రీలు మేక‌ప్ వేసుకోవ‌డం వ‌ల్ల వారి క‌డుపులో ఉండే బిడ్డ‌పై ఆ మేక‌ప్ సామ‌గ్రిలో ఉండే కెమిక‌ల్స్ ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌. 
 
ఫలితంగా, పుట్ట‌బోయే బిడ్డ‌లో చురుకుద‌నం లేక‌పోవ‌డం, మాన‌సిక ఆరోగ్యం సరిగ్గా ఉండ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మేకప్ సామాగ్రిని ఉపయోగించకుండా ఉండటమే తల్లీ బిడ్డకి క్షేమమని వైద్యులు చెబుతున్నారు.