1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : బుధవారం, 22 మే 2019 (11:52 IST)

బీట్‌రూట్, కలబంద రసంతో అండాశయ తిత్తులు పరార్..

వాస్తవానికి అండాశయ తిత్తులు ఏర్పడటం అనేది చాలా సాధారణమైన విషయం, కానీ నేటి కాలంలోని చాలా మంది స్త్రీలకు దీని గురించి సరైన అవగాహన లేకపోవడంతో ఇదో పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. కొన్ని రకాల ఔషధాలను వాడడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవడం చాలా సులభం. నిజానికి అండాశయ తిత్తులు అనేవి ద్రవాలతో నిండి ఉండే పాకెట్లు లేదా బుట్టలు. 
 
ఇవి తరచుగా ఒక అండాశయంపై లేదా రెండు అండాశయాల ఉపరితలం లేదా లోపలి వైపు ఏర్పడవచ్చు. "సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్" వారు తెలిపిన దాని ప్రకారం, ప్రీమెనోపౌసల్ కలిగిన స్త్రీలు తమ జీవిత కాలంలో ఈ రకం తిత్తులను చాలా కలిగి ఉంటారు. అయితే 14.8 శాతం మంది స్త్రీలు వీటిని మోనోపాజ్ తరువాత కలిగి ఉంటారు. ఇవి సాధరణంగా ఏర్పడేవే అయినా చాలా మంది స్త్రీలు వీటి గురించి సరైన అవగాహనను కలిగి లేరు, ఈ రకమైన సమస్యలను కొన్ని రకాల ఔషధాల ద్వారా తగ్గించుకోవచ్చు.
 
1. బీట్‌రూట్
బీట్‌రూట్ పెద్దగా పరిచయం అక్కర్లేని దుంప... సహజంగా బీటాసైనిన్ సమ్మేళనాన్ని అధికంగా కలిగి ఉండే ఈ బీట్‌రూట్, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచి, విష పదార్థాలను శరీరం నుండి బయటకి పంపడంలో సహకరిస్తుంది. అంతేకాకుండా, ఆల్కలైన్ గుణాలను కలిగి ఉండే బీట్‌రూట్, శరీరంలోని అసిడిటీని సమతుల్యపరుస్తుంది. ఒక కప్పు బీట్‌రూట్ రసాన్ని ఒక చెంచా కలబంద రసంతో కలిపి ఆ రసాన్ని రోజూ ఉదయాన అల్పాహారానికి ముందుగా సేవించడం వలన ఈ తిత్తుల సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
 
2. బరువు తగ్గటం
తాము ఉండవలసిన బరువు కంటే ఎక్కువ బరువు ఉండే వారిలో ఈస్ట్రోజెన్ సహజంగా విడుదలయ్యే దాని కంటే ఎక్కువ స్థాయిలో విడుదల కావడం జరుగుతుంది. ఇలా హార్మోన్ స్థాయిలు అధికంగా పెరగటం వలన శరీర వ్యవస్థలు వాటి విధి నిర్వహణలో లోపాలు ఏర్పడుతాయి. సన్నగా అయి, BMI ప్రకారం బరువు నిర్వహించుకోవడం వలన అండాశయ తిత్తుల ఏర్పాటును నివారించుకోవచ్చు. దీనికి తగినట్లు బరువు తగ్గేందుకుగానూ వ్యాయామాలు మరియు ఆహార మార్పులు చాలా విధాలుగా సహకరిస్తాయి.
 
3. హీట్ థెరపీ
కండరాల తిమ్మిరులు లేదా అండాశయ తిత్తుల వలన ఉదర భాగంలో కలిగేటటువంటి నొప్పి వంటి సమస్యలను హీట్ థెరపీతో తగ్గించుకోవచ్చు. హీటింగ్ ప్యాడ్‌ని లేదా వేడి నీటి బాటిల్‌ని, ఉదర భాగంలో లేదా పెల్విక్ భాగానికి కింద ఉంచటం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఉదరభాగంలో నొప్పి అనిపించినపుడు ఈ హీట్ థెరపీని కనీసం 15 నిమిషాలపాటు వాడటం ద్వారా సదరు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
 
4. సప్లిమెంట్స్
వీటన్నింటి తర్వాత హార్మోన్‌లను పునరుద్దరించుకోవడంతోపాటు తిత్తుల పరిమాణాన్ని తగ్గించుకోవడంలో కొన్ని రకాల ప్రత్యేక విటమిన్ మరియు సప్లిమెంట్‌లు బాగా సహకరిస్తాయి. మీ వైద్యుడిని కలిసి, ఈ రకం సప్లిమెంట్స్ ఏమైనా సిఫార్సు చేస్తారేమోనని అడిగి చూడండి.