మహిళల చేతికి గాజులు... కాళ్లకు పట్టీలు ఎందుకో తెలుసా?
మనకు పెద్దలు ఏ విషయం చెప్పిన దాని వెనుక ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఆడవాళ్లు గాజులు, పట్టీలు లాంటివి పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. కానీ ప్రస్తుతకాలంలో ఇవి మొరటుగా అయిపోయాయి. గాజులు, పట్టీలు పెట్టుకొనడం వలన ఆడవాళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
పూర్వం బయటి పని ఎక్కువగా మగవారే చేసేవారు. దాంతో వారికి బ్లడ్ సర్కిలేషన్ బాగా జరిగేది. కాని ఆడవారు ఇంట్లో ఎక్కువ ఉండటం వలన రక్తప్రసరణ సమస్యల బాధ ఉండేది. అప్పటినుంచే ఆక్యుపంక్చర్ టెక్నిక్ మొదలుపెట్టారు. అంటే శరీరంలో కొన్నిచోట్ల ఒత్తిడి పెంచడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుందని ఈ ఆక్యుపంక్చర్ టెక్నిక్ చెబుతుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా గాజులు, పట్టీలు తొడగడం మొదలుపెట్టారట. రాను రాను అవే అలంకారాలుగా మారాయి. మహిళల జీవితంలో ఓ భాగం అయిపోయాయి. చేతిలో గాజులు, కాలికి పట్టీలు కొన్ని నరాలని ఎప్పుడు తాకుతూ ఉంటాయి. దాంతో ఆక్యుపంక్చర్ టెక్నిక్ ద్వారా బ్లడ్ సర్కిలేషన్ సరైన ట్రాక్‌లో ఉంటుందని పూర్వం భావించేవారు. ఇప్పుడు కూడా ఆక్యుపంక్చర్ కొన్ని చికిత్సలకి ఉపయోగిస్తారు.
వెండితో చేయించే పట్టీలు ఎప్పుడు గలగలా చప్పుడు చేస్తూ ఉంటాయి. దాంతో ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, మహిళలు సంతోషంగా ఉంటే, ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలు అభిప్రాయపడేవారు. ఈ పట్టీల వలన కాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయని, అంతేకాకుండా ఈ ఆక్యుపంక్చర్ వలన రక్తప్రసరణ బాగా జరిగి మహిళల హార్మోన్స్ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భ సమస్యలు కంట్రోల్‌లో ఉంటాయని కూడా చెబుతారు.