గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:27 IST)

విడాకులు తీసుకోబోతున్న ప్రియమణి..

priyamani
ప్రముఖ హీరోయిన్ ప్రియమణి విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముస్తఫాను ప్రియమణి ప్రేమించి పెళ్లాడింది. ప్రియమణి ముస్తఫా గారి మొదటి భార్య అప్పట్లో పోలీస్ కేసు పెట్టింది కూడా పెట్టింది. కానీ ప్రియమణి వాటిని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా ముస్తఫాతో కాపురం చేస్తూ వచ్చింది.
 
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇటీవల కాలంలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయిందట. అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్‌లో వార్తలు వినిపిస్తాయి.
 
అసలు విషయానికి వస్తే ప్రియమణి గారికి ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదట. కెరీర్‌లో తానూ అనుకున్న స్థాయిలో స్థిరపడే వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ అయ్యిందట. కానీ ముస్తఫా అది నచ్చట్లేదు. 
 
ఆయనకీ పిల్లలు కావాలి. ఈ విషయంలోనే వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదరడం లేదు. తరుచు గొడవలు అవుతూనే ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.