శ్రీకారంలో శృంగారంగా అదరగొట్టిన హీరోయిన్ (video)
ప్రియాంక అరుల్.. నాని గ్యాంగ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పెద్దగా ఆ సినిమా ప్రేక్షకులను అలరించకపోగా అందులో నటించిన హీరోయిన్‌ను కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. ఆ తరువాత ప్రియాంక నటించిన సినిమా శ్రీకారం. ప్రస్తుత హిట్ టాక్‌తో సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది.
శర్వానంద్‌కు ఉన్న క్రేజ్‌తో సినిమా బాగానే ఆడుతోంది. యువప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియాంకకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ప్రియాంక తాజాగా తన మనస్సులోని మాటలను బయట పెట్టారు.
నాకు నవ్వు సీన్లలో నటించడం బాగా తెలుసు.. ఎమోషనల్.. ఏడుస్తూ సినిమాలు చేయగలను. కానీ శృంగారం చేయాలంటే మాత్రం నచ్చదు అంటోంది ప్రియాంక. కానీ శ్రీకారం సినిమాలో మాత్రం ఓణీలో బాగా అందాలు ఆరబోసింది ఈ భామ. పైకేమో శృంగారం అంటే ఛీ అని చెప్పే హీరోయిన్.. సినిమాల్లో మాత్రం రెచ్చిపోయి నటిస్తోందని అభిమానులు సందేశాలు పంపిస్తున్నారట.