సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:07 IST)

మహేష్ బాబుకు అరుదైన గౌరవం.. ఫిట్‌నెస్ విషయంలో..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది. కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, కొద్దికాలంలోనే తనదైన స్టైల్‌తో యూత్ ఫేవరెట్ హీరోగా మారాడు. సింపుల్ స్మైల్‌తో అమ్మాయిల మనసు దోచిన మహేష్ బాబు.. 4 ఏళ్ల వయసులోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 41 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో 35 సినిమాల్లో యాక్ట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు. 
 
అందులో హీరోగా 26 సినిమాల్లో నటిస్తే.. బాల నటుడిగా 9 చిత్రాల్లో తన నటనతో మెప్పించారు మహేష్ బాబు. ఇక కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా 21 ఏళ్ల కెరీర్‌లో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్నారు మహేష్ బాబు. తాజాగా మహేష్ బాబుకు మరో అరుదైన గౌరవం దక్కింది.
 
మహేష్ బాబుకు ఫిట్నెస్ విషయంలో Synt Globla Spa Fit and Fab Wellness Icon Award దక్కింది. ఈ విషయాన్నిమహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఫిట్నెస్ అనేది అంత ఈజీ కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఈ సందర్భంగా తనకు ఆ అవార్డు అందజేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.