బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (17:11 IST)

సింహా కోసం ఎన్‌టి.ఆర్‌. గెస్ట్‌!

ntr guest
సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణి కుమారుడు శ్రీ‌సింహా హీరోగా న‌టించిన సినిమా `మ‌త్తువ‌ద‌ల‌రా`. ఆ సినిమా విడుద‌ల‌కు సినీ దిగ్గ‌జాలు ప్ర‌మోష‌న్‌లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా `తెల్లవారితే గురువారం`కు మ‌ర‌లా వారంతా ముందుకు వ‌స్తున్నారు. ఈసారి వారిలో ఎన్‌.టి.ఆర్‌. కూడా వున్నాడు. ఎన్‌.టి.ఆర్‌. ముఖ్య అతిథిగా ఆ సినిమా ఫంక్ష‌న్ హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాకు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాత‌. మణికాంత్ కొత్త దర్శకుడు. హీరో చిన్నాన్న, దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాబోతున్నారు.
 
ఈ ఫంక్షన్ 21న జరుగుతుంది. హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నుంది. ఇక సంగీతాన్ని కీర‌వాణి రెండో కుమారుడు కాల‌భైర‌వ స‌మ‌కూర్చాడు. వారాహి చలన చిత్ర సంస్థ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇక క‌థ ప్ర‌కారం తెల్లారితే గురువారం అన‌గా ఓ విచిత్ర‌మైన  సంఘ‌ట‌న‌తో క‌థంతా మారిపోతుంది. అది తెర‌పై చూడాల్సిందేన‌ని ద‌ర్శ‌ఖుడు తెలియ‌జేస్తున్నాడు.