శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (12:10 IST)

ప్రియాంకను పొగడాలి కాబట్టి.. పొగుడుతున్నా.. అంతలేదంటున్న విలేకరి.........

మూడు పదుల వయసు దాటినా కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌, దాంతోపాటుగా 'బేవాచ్‌' మూవీతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి, వరుసగా అక్కడ అవకాశాల కోసం ట్రై చ

మూడు పదుల వయసు దాటినా కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌, దాంతోపాటుగా 'బేవాచ్‌' మూవీతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి, వరుసగా అక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తున్న ప్రియాంక ప్రస్తుతానికైతే హాలీవుడ్‌లో లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్స్‌, ఇంటిమేట్‌ సీన్స్‌తో హల్‌చల్‌ చేసేస్తోంది. 'క్వాంటికో' సిరీస్‌లో ప్రియాంక గ్లామర్‌కి అంతా ఫిదా అయిపోతున్నారట. 
 
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా ఇటీవల నూయార్క్‌లో ''ది ఎలెన్స్‌ షో'' అనే సెలబ్రెటీ చాట్‌లో పాల్గొంది. ఈ షోలో హోస్ట్‌ ఎలెన్‌.. ప్రియాంకతో సరదాగా మాట్లాడుతూనే అవమానపరచడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లైవ్‌ షోలో ప్రియాంక చేత టెకీలా(మద్యం) తాగించడమే కాకుండా ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్‌ బల్బు తీస్తున్నట్లు చెయ్యి వూపారు అందట.
 
మాటల సందర్భంలో...ఎలెన్‌ ''మీరు ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయిపోయారు. మీ అందం, నటన కూడా ప్రేక్షకులకి బాగా నచ్చింది'' అనగానే ప్రియాంక.. ''అలాంటిదేం లేదు'' అని చెప్పగా...''ఆ విషయం నాకు తెలుసు ఏదో మిమ్మల్ని పొగడాలి కాబట్టి అలా అన్నాను'' అని ఎలెన్ వెటకారంగా మాట్లాడిందట. కానీ ప్రియాంక మాత్రం ఆ మాటలను ఏ మాత్రం పట్టించుకోకుండా హుందాగా నడుచుకుందట. ప్రియాంక పట్ల ఎలెన్‌ తీరు బాలేదని ప్రియాంక అభిమానులు మండిపడుతున్నారు.