శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (15:52 IST)

దర్శకుల కోర్కెలు తీర్చలేక సినీ ఛాన్సులు వదిలేశానంటున్న బాలీవుడ్ నటి

సాధారణంగా చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతలతో పాటు హీరోలకు పడకసుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ నిలదొక్కుకోవాలంటే ఖచ్చింతగా లైంగిక కోర్కెలు తీర్చ

సాధారణంగా చిత్ర పరిశ్రమలో దర్శకనిర్మాతలతో పాటు హీరోలకు పడకసుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ నిలదొక్కుకోవాలంటే ఖచ్చింతగా లైంగిక కోర్కెలు తీర్చాల్సిందేనట. ఇదే విషయాన్ని పలువురు హీరోయిన్లు బాహాటంగానే అంగీకరించారు.
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతున్న ప్రియాంకా చోప్రా కూడా తనకు ఎదురైన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. దర్శకుల లైంగికపరమైన కోరికలు తీర్చలేక 10 సినిమాల వరకు వదిలివేసినట్టు చెప్పారు. తనకు సినీ కెరీర్ బిగినింగ్‌లో ఇలాంటి వేధింపులు తనకూ తప్పలేదనీ చెప్పుకొచ్చింది. 
 
ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రియాంకా 17 యేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటినుంచి ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఓ రోజున ఓ పెద్ద మనిషి వద్దకు తీసుకెళితే.. మీ అమ్మ కాసేపు బయట కూర్చొంటే నీకు కథ వినిపిస్తా అన్నాడు. 
 
మా అమ్మ వినలేకపోయే కథతో నేను సినిమా ఎలా చేస్తాను అని ప్రియాంకా సున్నితంగా చెప్పేసింది. దానివల్ల ఓ పెద్ద సినిమాలో నటించే అవకాశాన్ని ప్రియాంకా కోల్పోయింది. అలా దర్శకుల కోరికలు తీర్చకపోవడంతో ఓ పది సినిమాల్లో నటించే అవకాశాన్ని ఆమె కోల్పోయిందని చెప్పింది. బాలీవుడ్‌లో ఉన్నంతగా హాలీవుడ్‌లో లైంగిక వేధింపులు లేవని మధు చోప్రా చెప్పడం గమనార్హం.