గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (18:20 IST)

కమల్ హాసన్ నిర్మాతగా SK21 కాశ్మీర్‌లో గ్రాండ్ గా ప్రారంభం

Sivakarthikeyan, Sai Pallavi, Kamal Haasan, Rajkumar Periyasamy, GV Prakash
Sivakarthikeyan, Sai Pallavi, Kamal Haasan, Rajkumar Periyasamy, GV Prakash
ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ (SPIP) కలయికలో #SK21 అనౌన్స్ మెంట్ నుండి సందడి నెలకొంది. ‘మేజర్’ లాంటి విజయవంతమైన చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరోసారి దేశం గర్వించే వీరుల కథతో పంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని భరోసా ఇస్తోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, మహేంద్రన్ నిర్మించనున్నారు.
 
రాజ్ కుమార్ పెరియసామి రచన, దర్శకత్వం వహించిన వశిస్తున్న SK21, స్టార్ హీరో  శివకార్తికేయన్‌ను అతని అభిమానులు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా  బిగ్ స్క్రీన్ పై ప్రజంట్ చేయనున్నారు. 'గట్స్ అండ్ గోర్’ దేశభక్తి  కథాంశంతో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కు జోడిగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఈరోజు కాశ్మీర్‌ లోని అద్భుతమైన లొకేషన్లలో రెండు నెలల షెడ్యూల్‌తో ప్రారంభమైయింది.
 
నిర్మాతలు ఉలగనాయగన్ కమల్ హాసన్, మిస్టర్.ఆర్.మహేంద్రన్, శ్రీ.శివకార్తికేయన్, ఎం.ఎస్.సాయి పల్లవి, శ్రీ.రాజ్‌కుమార్ పెరియసామి, శ్రీ.జి.వి.ప్రకాష్, కో-ప్రొడ్యూసర్ శ్రీ వకీల్. ఖాన్, మిస్టర్ లడా గురుదేన్ సింగ్, జనరల్ మేనేజర్ హెడ్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఇండియా & మిస్టర్. నారాయణన్, సిఈవో, RKFI. సమక్షంలో చెన్నైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా అనౌన్స్ చేశారు.
 
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు జి వి ప్రకాష్, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, సినిమాటోగ్రాఫర్ సిహెచ్ సాయి, ఎడిటర్ ఆర్. కలైవానన్, యాక్షన్ డైరెక్టర్ స్టీఫన్ రిక్టర్. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తారాగణం: శివకార్తికేయన్, సాయి పల్లవి