గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

దర్శకుడిగా మారిన థర్టీ ఇయర్ ఇండస్ట్రీ.. ఆయన కుమార్తె హీరోయిన్‌!

prithvi
తెలుగు చిత్రపరిశ్రమలో థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్వీరాజ్. ఇపుడు ఆయన దర్శకుడుగా అవతారమెత్తారు. గతంలో రాజకీయాల్లో కొంత కాలం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీలోని వైకాపాలో ఆయన చేరి, ఎస్వీబీసీ చానెల్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని ఆ పదవికి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత ఆయన వైకాపాకు రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలో తాజాగా ఆయన దర్శకుడిగా అవతారమెత్తి, తన ప్రతిభను చాటుకోవాలని చూస్తున్నారు. ఈయన దర్శకత్వంలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆయన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా నటించడం గమనార్హం. క్రాంతి కృష్ణ హీరోగా ఎంపిక చేశారు.
 
విజయ రంగరాజు, అశోక్ కుమార్, గీతాసింగ్, జబర్దస్త్ నవీన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ పీఆర్ క్రియేషన్స్ బ్యానరుపై పద్మ రేఖ, గుంటక శ్రీనివాస్ రెడ్డి, కర్రి కృష్ణారెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. తాజా చిత్రం గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.