పూరీ నా గాళ్‌ఫ్రెండ్ అంటున్న శ్రుతి
దర్శకుడు పూరీ జగన్నాథ్ తనకు గాళ్‌ఫ్రెండ్ అనీ టీవీ, సినిమా నటి శ్రుతి సింగమ్ పల్లి అంటోంది. ఋతురాగాలు సీరియల్ నుంచి పలు ఫేమస్ సీరియల్స్‌తోపాటు సినిమాల్లోనూ లేడీ విలన్‌గా నటించిన శ్రుతి వున్నది వున్నట్లు మాట్లాడే నైజం. ఋతురాగాలు సీరియల్‌లోనే నటించిన మధుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ నటీనటులుగా బిజీగా అయ్యారు. అయితే ఆమెకు పూరీ జగన్నాథ్ అంటే చెప్పలేని ప్రేమ, అభిమానం ఏదైనా అనుకోండి. పూరీ జగన్నాథ్ వివాహంలో కూడా శ్రుతిదే కీలకపాత్ర. ఆమె తన పెళ్లి దగ్గరుండి చేసిందని పూరీ కూడా చెప్పారు.
ఇంతకీ పూరీ, శ్రుతి కాంబినేషన్ దూరదర్శన్ టీవీలో ఓ ప్రోగ్రామ్ చేయాలన్నప్పటినుంచీ పరిచయం వుంది. ఆమె మంచితనం, వాగ్ధాటి ఎదుటివారిని ఆకట్టుకునేలా చేస్తుంది. పూరీ చేసిన ఆ ఎపిసోడ్‌లో ఆమె హీరోయిన్. అంటే పూరీ తొలి హీరోయిన్ ఆమేనే అని చెప్పవచ్చు. ఇటీవలో ఓ సందర్భంగా పూరీ ఆమె గురించి చెబుతూ, చిన్నప్పటినుంచి తెలుసు. ఆమెది మంచి మనస్తత్వం. అందరూ కరోన టైంలో ఖాళీగా ఇంటిలోనే కూర్చుంటే ఆమె మాత్రం సీరియల్స్‌లో నటిస్తూ సంపాదించేసింది. ఆ డబ్బంతా ఏం చేసుకుంటుంది. ఎక్కడ పెడుతుందంటూ కామెంట్ చేశారు.
దీనికి శ్రుతి స్పందిస్తూ, సీరియల్ లో పెద్దగా డబ్బులు రావండి. ఏదో ఖాళీగా వుండలేక నటిగా చేయాలి కాబట్టి చేస్తున్నానని బదులిచ్చింది. అనంతరం పూరీ గురించి ఆయన ఔనత్యం గురించి చెబుతూ, పూరీతో మా అనుబంధం ఎప్పటిదో. ప్రతి మనిషికి ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి మంచి స్నేహితుడు వుండాలి. నాకు అలాంటి వ్యక్తి ఆయన ఒకరకగా చెప్పాలంటే నా గాళ్ ఫ్రెండ్ అంటూ వివరించింది.. పూరీని ముద్దుగా ఓ పేరుతో పిలుచుకుంటుంది కూడా. సో. ఆ రకంగా పూరీ ఆమెకు గాళ్ ప్రెండ్ అయ్యాడన్నమాట. ఇటీవలే ఓ టీవీలో షోలో ఆమె చెప్పిన విశేషాలు ఇవి.