బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 31 మే 2021 (16:40 IST)

గోల్డెన్ టెంపుల్ అందం వ‌ర్ణించ‌లేనుః కంగ‌నా

Kangana-golden temple
గురు నానక్ దేవ్ ఆశీర్వాదం కోసం బాలీవుడ్ న‌టి కంగనా రనౌత్ సోమవారం తన కుటుంబంతో కలిసి అమృత్సర్ లోని ప్రసిద్ధ శ్రీ హర్మండిర్ సాహిబ్- గోల్డెన్ టెంపుల్ను సందర్శించారు. తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన సందర్శన నుండి చిత్రాలను పంచుకున్నారు. 34 ఏళ్ల ఆమె భారతదేశంలోని ఉత్తర భాగంలో పెరిగినప్పటికీ, ఈ ఆలయానికి ఆమె చేసిన మొదటి సందర్శన అని తెలిపారు. ఆలయం ప్రశాంతమైన అందంగా దైవ‌త్వంతో కూడుకుంద‌ని ఆశ్చర్యపోయిన ఆమె, "మాటలు లేనివి .ఈ గోల్డెన్ టెంపుల్ అందం దైవత్వం గురించి చెప్ప‌డానికి.." అని అక్క‌డ నోట్‌లో రాశారు. నీలిరంగు పాస్టెల్ రంగు చురిదార్ సూట్ ధరించింది. కంగనా తన మేనల్లుడితో కలిసి పుణ్యక్షేత్రం ముందు పోజులిచ్చింది. 
 
కాగా, ఆమె ఇటీవల కోయంబత్తూర్ లోని ప్రసిద్ధ ఆదిశక్తి ఆశ్రమం, పూరి జగన్నాథ్ ఆలయం సంద‌ర్శించిన వాటిలో వున్నాయి. ఇదిలావుండగా, కంగనా రనౌత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ 'తలైవి' ఏప్రిల్ 23న థియేటర్లలో విడుదల కావాల్సింది. క‌రోనా వ‌ల్ల సాధ్య‌ప‌డ‌లేదు.  అందుకే ఈ సంవత్సరం వాయిదా పడింది. ఈ చిత్రం తమిళనాడు ప్రముఖ నటి,  రాజకీయ నాయకురాలు జయలలిత జీవితంపై బయోపిక్. ఎ. ఎల్. విజయ్ నేతృత్వంలో, 'తలైవిస‌  హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. ఇవే కాకుండా ఆమె పైప్‌లైన్‌లో 'తేజస్స‌, ద‌క్క‌డ్‌, 'మణికర్ణికా రిట‌ర్స్‌, లెజెండ్ ఆఫ్ దిడ్డా' కూడా ఉన్నాయి. ఇది కాకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించడానికి కంగనా సంతకం చేసింది.