కరోనా నుంచి కోలుకున్న కంగనా రనౌత్
బాలీవుడ్ సినీ నటి కంగనా రనౌత్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆమెకు తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షలో నెగటెవివ్ అని వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నిర్ధారించింది.
కాగా, ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు 34 ఏళ్ల కంగన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనాను తాను ఎలా ఎదుర్కొన్నాననే విషయాన్ని చెప్పాలని తనకు ఉన్నప్పటికీ... కోవిడ్ ఫ్యాన్ క్లబ్స్‌ను నిరాశపరచాలనుకోవడం లేదని చెప్పింది.
వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది.
కాగా, కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినవెంటనే ఆమె మాట్లాడుతూ, ఇది చిన్ని ఫ్లూ మాత్రమే అయినప్పటికీ... మనుషులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని వ్యాఖ్యానించింది. తాను కరోనాను జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది.