శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: శనివారం, 29 సెప్టెంబరు 2018 (14:43 IST)

పుట్టిన‌రోజు నాడు కూడా క‌న‌ప‌డ‌ని పూరి... అస‌లు ఎక్క‌డున్నాడు...?

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఒక‌ప్పుడు హిట్లు, సూప‌ర్ హిట్లు, బ్లాక్ బ‌ష్ట‌ర్ హిట్స్, ఇండ‌స్ట్రీ హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల కాలంలో పూరి నుంచి నిరాశ ఎదుర‌వుతుంది త‌ప్ప స‌రైన సినిమా రావ‌డం లేదు. టెంప‌ర్ సినిమా త‌ర్వాత పూరి తీసిన

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఒక‌ప్పుడు హిట్లు, సూప‌ర్ హిట్లు, బ్లాక్ బ‌ష్ట‌ర్ హిట్స్, ఇండ‌స్ట్రీ హిట్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల కాలంలో పూరి నుంచి నిరాశ ఎదుర‌వుతుంది త‌ప్ప స‌రైన సినిమా రావ‌డం లేదు. టెంప‌ర్ సినిమా త‌ర్వాత పూరి తీసిన సినిమాలు ఏవీ కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. త‌న‌యుడు ఆకాష్‌తో తెర‌కెక్కించిన మెహ‌బూబా సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ.. ఈ సినిమా కూడా విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది.
 
దీంతో పూరి బాగా అప్‌సెట్ అయ్యాడు. నెక్ట్స్ సినిమాని కూడా ఆకాష్‌తోనే చేయాలి అనుకున్నాడు. క‌థ రెడీ చేసాడు కానీ.. ఆఖ‌రి నిమిషంలో ఆకాష్‌తో సినిమాని త‌న శిష్యుడు అనిల్‌కి అప్పచెప్పి త‌ను మాత్రం వేరే సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఇదిలాఉంటే.. సెప్టెంబ‌ర్ 28న పూరి పుట్టిన‌రోజు. ప్ర‌తి సంవ‌త్స‌రం పూరి పుట్టిన‌రోజున ఆయ‌న అభిమానులు పూరిని క‌లిసి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తారు.
 
కానీ.. ఈ సంవ‌త్స‌రం అలా జ‌ర‌గ‌లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం ఆయ‌న అభిమానులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేసారు. ఆయ‌న సంస్థ పూరికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేసిన వారికి థ్యాంక్స్ చెప్పింది కానీ.. పూరి మాత్రం స్పందించ‌లేదు. ట్విట్ట‌ర్లో యాక్టీవ్‌గా ఉండే పూరి మోహ‌బూబా రిలీజ్ త‌ర్వాత ట్విట్ట‌ర్లో కూడా సైలెంట్ అయ్యాడు. హాలీవుడ్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి... పూరి ఈజ్ బ్యాక్ అనేలా హిట్ సినిమా ఇస్తాడ‌ని ఆశిద్దాం.