శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:35 IST)

'నేను హీరోను కాదు... రితికానే తొలి హీరో'.. శివలింగ హీరో లారెన్స్

సీనియర్‌ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో లారెన్స్, రితికా జంటగా తెరకెక్కిన చిత్రమే ‘శివలింగ’. ఏప్రిల్‌ 14న తెరపైకి రాబోతోంది. ఇందులో హీరో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ... సాధారణంగా సినిమాల ప్రమోషన్స్‌లో హీరోల

సీనియర్‌ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో లారెన్స్, రితికా జంటగా తెరకెక్కిన చిత్రమే ‘శివలింగ’. ఏప్రిల్‌ 14న తెరపైకి రాబోతోంది. ఇందులో హీరో రాఘవ లారెన్స్ మాట్లాడుతూ... సాధారణంగా సినిమాల ప్రమోషన్స్‌లో హీరోలు... ఈ సినిమాలో కథే అసలైన హీరో అని చెబుతుంటారు. కానీ, ‘శివలింగ’లో హీరోయిన్ రితికానే మొదటి హీరో అని వ్యాఖ్యానించారు.
 
‘శివలింగ’లో తొలి హీరో రితికాయేనని, పవర్‌ఫుల్‌ రోల్‌లో అద్భుతంగా నటించిందని, ఆమె నటించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చారు. వడివేలుకి తాను పెద్ద అభిమానినని, ఆయనతో, సీనియర్‌ నటి భానుప్రియ, రాధారవిలతో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. ‘శివలింగ’ ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుందని, పెద్ద విజయం సాధిస్తుందని లారెన్స్ ధీమా వ్యక్తంచేశారు. 
 
అనంతరం దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ కన్నడంలో అమోఘ విజయం సాధించిన ‘శివలింగ’ను తమిళంలో రీమేక్‌ చేద్దామనుకున్నప్పుడు తొలుత తన మదిలో మెదిలిన హీరో లారెన్సేనని చెప్పారు. రజనీకాంత్‌తో తాను తీసిన ‘ఉళైప్పాళి’ చిత్రంలోని ఒక పాటలో జూనియర్‌ ఆర్టిస్టుల నాల్గవ వరుసలో నిలబడి డ్యాన్స్ చేసిన లారెన్స్‌తోనే ఇప్పుడు తాను సినిమా తెరకెక్కించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మినిమం గ్యారంటీ హీరోగా లారెన్స్ గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు.