శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (16:13 IST)

కొడుకు సినీ ఎంట్రీకి రవితేజ నో... షూటింగ్‌ సమయంలో డుమ్మా కొట్టిన మాస్ రాజా...

మాస్ మహారాజ రవితేజ చిత్రం 'రాజా ది గ్రేట్' వచ్చే బుధవారం దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో రవితేజ కుమారుడు నటిస్తున్నాడు. కానీ తన కుమారుడు సినీ ఎంట్రీపై మాస్ రాజాకు ఎంతమాత్రం ఇష్టం లేదట.

అప్పుడే వాడికెందుకు సినిమాలు అని చెప్పినా నిర్మాత, దర్శకుడు రవితేజపై ఒత్తిడి తీసుకురావడంతో సరేనని అయిష్టంగానే అంగీకరించాడట. కాగా ఈ చిత్రంలో తన కుమారుడితో షూటింగ్ జరిగే సమయంలో రవితేజ స్పాట్ కు రాకుండా ఎగ్గొట్టేశాడట. ఇలా రాకుండా వుండటానికి కారణం.. ఇష్టం లేకనా లేదంటే తను స్పాట్లో వుంటే కుమారుడు తనను చూసి జడుసుకుని యాక్టింగ్ సరిగా చేయలేడనా... కారణం ఏదయినప్పటికీ రవితేజ మాత్రం కుమారుడి యాక్టింగ్ మాత్రం చూడలేదట.