గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2024 (13:29 IST)

రాజమౌళి, రమా రాజమౌళి గురించి సీక్రెట్ చెప్పిన డాన్స్ మాస్టర్ ఆర్.కె. (రాధా కృష్ణ)

Master RK- Rajamouli
Master RK- Rajamouli
మార్చి ముప్పవ తేదీన దర్శకుడు రాజమౌళి, రమా రాజమౌళి ఇద్దరూ ఓ స్టేజీ పై డాన్స్ చేసి అలరించారు. ఇది యాక్టివల్ గా ఓ సంగీత్ వేడుకలో భాగం. ఈ డాన్స్ కంపోజ్ చేసింది మాస్టర్‌ ఆర్‌.కె (రాధాకృష్ణ). ఇతను నెల్లూరుకు చెందిన వ్యక్తి చెన్నైలో లారెన్స్ వంటి వారి దగ్గర డాన్స్ చేస్తుండేవాడు. అలాంటిది ఆర్.ఆర్.ఆర్. సినిమా షూటింగ్ రాజస్థాన్ లో జరుగుతుండగా రాజమౌళితో ఆర్.కె.కు మంచి కనెక్షన్ ఏర్పడింది. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...
 
Rama-Rajamouli dance
Rama-Rajamouli dance
రాజమౌళి డాన్స్‌ చేయటానికి పాఠాలు నేర్పిన ఆర్.కె. ఇలా తెలియజేస్తున్నారు. దారి చూడు దుమ్ముచూడు.. పాటకు రిహార్సల్ వేస్తుండగా. రాజమౌళి గారు వెనక నుంచి డాన్స్ చేశారు. ఏమిటి. సార్.. డాన్స్ చేస్తారా.. అని అడిగా.. ఓకే బాగుందని.. కానీ.. ఓల్డ్ సాంగ్ నాగేశ్వరరావుగారి సినిమాలోనిది ఓ మూవ్మెంట్ కావాలని అన్నారు. అది కూడా తనకే అనే సరికి నాకు ఆశ్చర్యమేసింది. 
 
నెక్ట్స్ డే పర్సనల్ గా ఫోన్ చేసి.. ఉదయం ఆరు గంటలకు  ఇంటికి పిలిపించి నాకు డాన్స్ మూవ్ మెంట్ చూపించమనేవారు. మూమెంట్ చెప్పగానే వెంటనే చేసేవారు. చాలా ఫాస్ట్ గా నేర్చుకునేవారు. ఇదంతా జైపూర్ లో షూటింగ్ లో జరుగుతున్నప్పుడు ఆర్.ఆర్.ఆర్.. షూటింగ్ లో జరిగింది.
 
ఆయనే కాదు. రాజమౌళి గారు ఫ్యామిలీ అంతా సెట్ కు వచ్చినప్పుడు అందరూ డాన్స్ చేస్తారు. వవన్ కళ్యాన్ సినిమా. `మెరికల్ తిరుగుతుంది అమ్మాయో... ` అనే సాంగ్ ను మూవ్ మెంట్ అడిగి చేనేవారు. ఆయన డాన్స్ కూడా ప్రతిదీ పరిశీలిస్తారు. డాన్స్ చేస్తే వెనుక కూడా కెమెరా పెట్టి షూట్ చేయమనేవారు. డాన్స్ కు వెనుక భాగం కెమెరా ఎందుకు అనే డౌట్ తో అడిగాను. ఆయన వివరించి చెప్పాక ఆయన టాలెంట్ అర్థమయింది. ఆర్.ఆర్.ఆర్.లో ఎన్.టి.ఆర్., చరణ్ డాన్స్ చేస్తుండగా మొత్తం కెమెరా రౌండ్ తిరుగుతుంది. అన్ని ఎమోషన్స్, మూవ్ మెంట్ చూపించి కొత్తగా చేయించేవారు. ఇక హీరోలతో డాన్స్ చేయించేటప్పుడు రాజమౌళి చేసి చూపిస్తూ.. ఒకటికి పదిసార్లు రిహార్సల్స్ చేయించేవారు.
 
ఇక షూటింగ్ లో చిన్నపిల్లలుంటే.. వారితో సరదాగా ఆడుతుంటారు. ఇక రమా రాజమౌళి గారు కూడా క్లాసికల్ డాన్సర్. ఆ విషయం చాలా మందికి తెలీదు. అందుకే ఆమె చాలా ఈజీగా నేర్చేసుకుంది. ఇదంతా మార్చి ముప్పయవ తేదీన సంగీత్ వేడుకలో డాన్స్ చేశారని డాన్స్ మాస్టర్ రాధాకృష్ణ చెప్పారు.