గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 15 మార్చి 2019 (21:07 IST)

ఎంత కష్టంలో ఉన్నా ఆ ఒక్కటి చేయండంటున్న రకుల్ ప్రీత్ సింగ్

క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా హిందీ భాషలో కూడా రకుల్ ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు. తాను సొంతంగా పెట్టిన జిమ్‌ను చూసుకునేందుకు ఆమెకు తీరిక లేదు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ బిజీగా ఉన్నా కొద్దిసేపు ఖచ్చితంగా నవ్వుకుంటే ఆ కష్టం మొత్తం పోతుందని చెబుతోంది.
 
ఎవరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు కూర్చోండి.. మీకు నచ్చిన విషయాన్ని మీ స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కడుపారా నవ్వండి. అంతే... అంతా మర్చిపోతారు. అదొక్కటే నా చిట్కా. మీరు అదే పాటించండి అని అభిమానులకు సలహా ఇస్తూ ట్వీట్ చేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. నవ్వు అన్ని విధాలా ఆరోగ్యమని కూడా చెబుతోంది రకుల్. ఇటీవలే రకుల్ హ్యాపీగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను కూడా షేర్ చేసింది.