మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (18:28 IST)

రామ్ చ‌ర‌ణ్ లుక్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్‌

Ram Charan, Mumbai, Nike Store
మెగా పవర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తాజాగా ముంబై వెళ్ళారు. అక్క‌డ ఎయిర్ట్ పోర్ట్‌లో నుంచి బ‌య‌టు వ‌స్తున్న ఫొటోలు పోస్ట్ చేశారు. బ్రాండ్ కంపెనీ అయిన నైక్ స్టోర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ క‌నిపించారు.  నైక్ క్యాప్, జాకెట్ మరియు షూస్ ధరించి వ‌స్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గానే అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.
 
నైక్ కంపెనీకి అంబాసిడ‌ర్‌లా బాగా వున్నావంటూ కొంద‌రు ప్ర‌శంసిస్తుంటే, ఈ లుక్ ఏ సినిమాలోనిద‌ని అభిమానులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఇటీవ‌లే ముంబైలో రామ్‌చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్ సినిమా షూట్ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెళ్ళిన‌ట్లు తెలిసింది. ఇది పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త్వ‌ర‌లో మ‌ర‌లా ఆ సినిమా ప్ర‌మోష‌న్‌ను మ‌రోసారి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.