శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (17:48 IST)

టాలీవుడ్‌లో పవర్ స్టార్ వారసుడు.. ''సైరా'' తర్వాత అకీరాతో చెర్రీ సినిమా? (video)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో లేని లోటును తీర్చేందుకు ఆయన వారసుడు టాలీవుడ్‌లోకి రానున్నాడు. పవర్ స్టార్ అకీరాను సినిమాల్లోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాను రాజకీయాల్లో బిజీగా ఉంటూ తనయుడిని సినిమా ఇండస్ట్రీలో బిజీ చేయాలని ఆయన సన్నాహాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం రామ్ చరణ్‌కి కుమారుడి బాధ్యతలు అప్పగించారని ఫిలిం నగర్ టాక్.
 
ఇందులో భాగంగా చెర్రీ నిర్మాణ సారథ్యంలో అకీరానందన్ సినిమా తెరకెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలోనే అకీరా తొలి సినిమాను నిర్మించాలని చెర్రీ స్కెచ్ వేస్తున్నారట.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యారు కాబట్టి ఆయన సినీ వారసత్వాన్ని అకీరాతో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. 
 
ఇప్పటికే నిర్మాతగా రామ్ చరణ్ సక్సెస్ అయ్యారు. సైరా నరసింహారెడ్డి చిత్రం ద్వారా కలెక్షన్లు రాబట్టారు. ఇదే తరహాలో అకీరా నందన్ సినిమాను నిర్మించి.. మంచి కలెక్షన్లతో పాటు పవర్ స్టార్ వారసుడి తెరంగేట్రం తన చేతుల మీదుగా జరగాలని చెర్రీ భావిస్తున్నట్లు సమాచారం.