శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 9 అక్టోబరు 2019 (14:11 IST)

మోహన్ లాల్ కుమారుడితో కళ్యాణి ప్రియదర్సిని ప్రేమాయణమా?

హలో మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కళ్యాణి ప్రియదర్సిని. చేసిన సినిమాలు తక్కువే అయినా ప్రియదర్సినికి తెలుగులో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ కేరళ భామ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసేందుకు ఇష్టపడుతోందట. అయితే ఆమె సినిమాల కన్నా ముందు తన ప్రియుడితో డేటింగ్‌లో ప్రస్తుతం బిజీగా ఉందట.
 
ప్రముఖ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రవీణ్ లాల్‌తో కళ్యాణి ప్రియదర్సిని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందట. గత మూడు నెలల నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం పీక్స్‌కు చేరిందట. అయితే గత 15 రోజుల నుంచి డేటింగ్‌లో కూడా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్సిని తండ్రి ఇద్దరూ మంచి స్నేహితులు.
 
మోహన్ లాల్‌కు ఎన్నో హిట్లు ఇచ్చారు ప్రియదర్సన్. దీంతో వీరిద్దరి మధ్య నడుస్తున్న ఈ ప్రేమ వ్యవహారానికి ఎవరూ అడ్డుచెప్పడం లేదట. త్వరలోనే వీరు పెళ్ళి చేసుకోబోతున్నారట. నూతన సంవత్సరంలో పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చేశారట వీరిద్దరు. ఏం జరుగుతుందో చూడాలి.