శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (11:33 IST)

ప్రియుడుతో ఏకాంతంగా గడిపిందనీ.... గ్రామస్థులు ఏం చేశారో తెలుసా?

ఆ యువతి తనకు నచ్చిన ఓ యువకుడిని ప్రేమించింది. దీంతో అతనితో కలిసి ఏకాంతంగా తిరుగుతూ గ్రామస్థుల కంటపడింది. అంతే.. ఆ యువతిని పట్టుకుని గుండు గీయించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ ఘటన ఒడిషా రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒడిషా రాష్ట్రంలోని మయూర్ భంజ్ సమీపంలోని మండువా గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన మరో యువకుడిని ప్రేమించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఏకాంతంగా గడుపుతుండగా ఆమె గ్రామస్థుల కంటపడింది. 
 
అంతే... ఆ ప్రేమ జంటపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. అంతటితో శాంతించని వారి ఆగ్రహం... ఆ యువతికి గుండు గీయించారు. ఈ ఘటన శనివారం జరుగగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. 
 
యువతికి గుండు గీస్తున్న సమయంలో కొంతమంది యువత తమ మొబైల్ ఫోనులో షూట్ చేసి... సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి గుండు గీసిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.